ap cm jagan team cabinet ministers history | సీఎం జగన్‌ తన మంత్రివర్గం #ysrcp #andhrapradesh

ap జట్టు.. నేపథ్యమిదీ!
అమరావతి: ఏపీ కేబినెట్‌ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. సీఎం జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. ఎక్కువగా సీనియర్లకు అవకాశమిచ్చారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. చోటు దక్కించుకున్న 25 మంది పేర్లు వెల్లడయ్యాయి. కేబినెట్‌లో బెర్త్‌ ఖరారైన నేతల నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. 
శ్రీకాకుళం
ధర్మాన కృష్ణదాస్‌
నియోజకవర్గం: నరసన్నపేట
వయస్సు: 64
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
విజయనగరం
బొత్స సత్యనారాయణ
నియోజకవర్గం: చీపురుపల్లి
వయస్సు: 61
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
పాముల పుష్ప శ్రీవాణి
నియోజకవర్గం: కురుపాం
వయస్సు: 31
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
విశాఖపట్నం
ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)
నియోజకవర్గం: భీమిలి
వయస్సు: 52

విద్యార్హత: ఇంటర్మీడియెట్
రాజకీయ అనుభవం: ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే
తూర్పుగోదావరి
పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
నియోజకవర్గం: మండపేట
వయస్సు: 69
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యే, వైఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.
పినిపె విశ్వరూప్‌
నియోజకవర్గం: అమలాపురం
వయస్సు: 55
విద్యార్హత: బీఎస్సీ, బీఈడీ
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
కురసాల కన్నబాబు
నియోజకవర్గం: కాకినాడ రూరల్‌
వయస్సు: 46
విద్యార్హత: బీకాం, ఎంఏ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో కీలక నేతగా పనిచేశారు.
పశ్చిమగోదావరి
తానేటి వనిత
నియోజకవర్గం: కొవ్వూరు
వయస్సు: 45
విద్యార్హత: ఎమ్మెస్సీ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
చెరుకువాడ శ్రీరంగనాథరాజు
నియోజకవర్గం: ఆచంట
వయస్సు: 66
విద్యార్హత: ఇంటర్మీడియట్
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)
నియోజకవర్గం: ఏలూరు
వయస్సు: 49
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం. కాంగ్రెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేశారు.
కృష్ణా
కొడాలి నాని
నియోజకవర్గం: గుడివాడ
వయస్సు: 47
విద్యార్హత: పదో తరగతి
రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
వెల్లంపల్లి శ్రీనివాస్‌
నియోజకవర్గం: విజయవాడ (పశ్చిమ)
వయస్సు: 48
విద్యార్హత: పదో తరగతి
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌, భాజపాలో పనిచేశారు.
పేర్ని వెంకట్రామయ్య (నాని)
నియోజకవర్గం: మచిలీపట్నం
వయస్సు: 49
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
గుంటూరు
మేకతోటి సుచరిత
నియోజకవర్గం: ప్రత్తిపాడు
వయస్సు: 41
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మోపిదేవి వెంకటరమణ
నియోజకవర్గం: రేపల్లె
వయస్సు: 55 సంవత్సరాలు
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.
ప్రకాశం
బాలినేని శ్రీనివాసరెడ్డి
నియోజకవర్గం: ఒంగోలు
వయస్సు: 55
విద్యార్హత: ఇంటర్మీడియెట్‌
రాజకీయ అనుభవం: ఐదుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
నెల్లూరు
మేకపాటి గౌతమ్‌రెడ్డి
నియోజకవర్గం: ఆత్మకూరు
వయస్సు: 45
విద్యార్హత: ఎమ్మెస్సీ (టెక్స్‌టైల్స్‌)
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అనిల్‌కుమార్‌ యాదవ్‌
నియోజకవర్గం: నెల్లూరు సిటీ
వయస్సు: 39
విద్యార్హత: బీడీఎస్‌
రాజకీయ అనుభవం: ఒకసారి కార్పొరేటర్‌గా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు
 
కర్నూలు
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
నియోజకవర్గం: డోన్‌
వయస్సు: 47
విద్యార్హత: బీఈ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం. పీఏసీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.
గుమ్మనూరు జయరాం
నియోజకవర్గం: ఆలూరు
వయస్సు: 51
విద్యార్హత: పదోతరగతి
రాజకీయ అనుభవం: జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
చిత్తూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నియోజకవర్గం: పుంగనూరు
వయస్సు: 67
విద్యార్హత: ఎంఏ, పీహెచ్‌డీ (సోషియాలజీ)
రాజకీయ అనుభవం: ఆరు సార్లు ఎమ్మెల్యే, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి.
కడప
అంజద్‌ బాషా
నియోజకవర్గం: కడప
వయస్సు: 48
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: కార్పొరేటర్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అనంతపురం

యం. శంకరనారాయణ
నియోజకవర్గం: పెనుకొండ
వయస్సు: 54
విద్యార్హత: బీకాం, ఎల్‌ఎల్‌బీ
రాజకీయ అనుభవం: అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం‌ ebe reservation bill

Endhuku ? Full Song | Lakshmi's NTR Movie Songs | RGV | Kalyani Malik | ...