ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం‌ ebe reservation bill

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుపై చర్చ ముగింపు సందర్భంగా.. కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15కి క్లాజ్‌(6), 16కి క్లాజ్‌(6) చేరుస్తున్నామని ప్రకటించారు. రెండేళ్ల క్రితం తమ ప్రభుత్వమే క్రిమిలేయర్‌ పరిమితిని రూ.6లక్షల నుంచి 8లక్షలకు వరకు పెంచిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్‌ ఓటింగ్‌ తప్పనిసరి అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పష్టం చేశారు. దీంతో సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై డివిజన్‌ పద్దతిలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా 323 మంది సభ్యులు, వ్యతిరేకంగా ముగ్గురు సభ్యులు ఓటు వేశారు. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభ నిరవధిక వాయిదాపడింది.

లోక్‌సభ ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఈబీసీ రిజర్వేషన్లు 50శాతం కోటా పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. 50శాతం కోటాకు అదనంగా ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గహ్లోత్‌ స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా కులాలు, మతాలకు అతీతంగా ఈబీసీలందరికీ రిజర్వేషన్లు అందనున్నాయి.  రిజర్వేషన్లకు అర్హత ధ్రువీకరణలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

Popular posts from this blog

Endhuku ? Full Song | Lakshmi's NTR Movie Songs | RGV | Kalyani Malik | ...

ap cm jagan team cabinet ministers history | సీఎం జగన్‌ తన మంత్రివర్గం #ysrcp #andhrapradesh